సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:33 IST)

ఆటోలో మహిళపై దాడి.. కత్తితో గొంతు కోసి బంగారాన్ని దోచుకెళ్లారు..

crime scene
మహబూబ్‌నగర్‌లోని పెద్దపల్లిలో ఓ మహిళపై దారుణంగా దాడి చేసి ఆటోలో దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దూరు మండలానికి చెందిన కృష్ణమ్మ అనే బాధితురాలు పెద్దపల్లిలోని తన సోదరుల గ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. 
 
అయితే కొద్దిసేపటికే మరికొంత మంది ప్రయాణికులు ఆటో ఎక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆటో పెద్దపల్లి శివారు సమీపంలోకి రాగానే దుండగులు డ్రైవర్‌ను కొట్టి కృష్ణమ్మపై దాడి చేసి కత్తితో గొంతు కోసి బంగారు నగలను అపహరించారు. 
 
డ్రైవర్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.