వరద నీటిలో కొట్టుకుని పోయిన కారు... ఇద్దరు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజుల్ నగర్‌లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పోర్లుతుంది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు ప్రమాదవశాత్తు వేములవాడ వద్ద కాలువలో పడి నీటిలో కొట్టుకుని పోయింది.
దీన్ని గుర్తించిన స్థానికులు ఆ కారులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారిలో గంగ (40), కిట్టు (4) అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.