మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (15:23 IST)

ఫేస్ బుక్ ఫ్రెండ్‌తో పెళ్లి, ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసి ఫ్రెండ్స్‌కి అప్పగించాడు

ఫేస్ బుక్ ద్వారా పరిచయాల పెంచుకుని చివరకు నిండు జీవితాన్ని బలితీసుకుంటున్న ఎంతోమంది యువతీ యువకులను చూశాం. అలాంటి ఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది. యువకుడిని నమ్మి వెళ్ళిన యువతిపై దారుణంగా అత్యాచారం చేశారు అతని స్నేహితులు. 
 
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని గౌలీపురాకు చెందిన అభిషేక్ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. పక్కనే ఉన్న తిరుమలగిరి ప్రాంతానికి చెందిన పదహారేళ్ళ బాలిక ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలలుగా ఫోటోలను చూసి వీరు ప్రేమించుకుంటున్నారు.
 
అయితే ఈ నెల 24వ తేదీన అభిషేక్‌ను నమ్మి ఆ యువతి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన ముగ్గురు స్నేహితుల సహకారంతో ఆ యువతిని అభిషేక్ వివాహం చేసుకున్నాడు. తన స్నేహితుడి గదికి తీసుకెళ్ళి నేను నీ భర్తను అంటూ రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు.
 
వివాహం చేసుకున్నాక నేను నీ భర్తను అంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగలేదు. 27వ తేదీ తన స్నేహితులు ముగ్గురు ఇంటికి వచ్చారు. బయటకు వెళ్ళి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి బయట తలుపులకి గడియ పెట్టాడు. అనంతరం అతడి ముగ్గురు స్నేహితులు ఆ యువతిపై అత్యాచారం చేశారు.
 
ఆ యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు.