గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:00 IST)

తాళ్ళబస్తీలో యువతి అదృశ్యం

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఈమెకు 20 యేళ్లు. సోమవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన స్వాతి తిరిగి రాలేదు. 
 
దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఎంతగానో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో స్వాతి అన్న అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్వాతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.