ప్రభాస్ పేరు దేశదేశాలకు పాకుతోంది!
రాజమౌళి పుణ్యమా అని నటుడు ప్రభాస్ పేరు ఎల్లలు దాటింది. ఆయన చేస్తున్న 'బాహుబలి' సినిమానే అందుకు కారణం. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యం. ఇది అన్ని దేశాల్లోనూ కథలుకు తగినట్లేగా వుంటుందట. ప్రస్తుతం ఫిలింసిటీలో ముగింపు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే కొన్ని స్టిల్స్ రాజమౌళి ట్విట్టర్లో విడుదల చేయడంతో... వాటికి చైనాలో కూడా ప్రాచుర్యం లభిస్తోందట.
సెల్ఫోన్లలో కవర్ ముద్రగా ప్రభాస్‌ను వేసి అమ్ముతున్నారట. ప్రభాస్ ఫిజిక్ నచ్చి వారు వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ... చెబుతున్నారు. ఐ ఫోన్‌పై ప్రభాస్ ఫొటో ముద్రించడం చూసి అవాక్కయ్యాని తెలిపాడు. కేవలం రాజమౌళి పుణ్యమా అని మా సినిమా ఖండఖండాలకు వ్యాపిస్తోందని కామెంట్ పెట్టారు.