ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2014 (14:52 IST)

పూడిపెద్ది జోగేశ్వర శర్మ (అ) పీజే శర్మ ఇకలేరు: గుండెపోటుతో మృతి!

సినీ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, హీరో సాయికుమార్‌కు తండ్రి పీజే శర్మ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. శర్మ మనుమడు, సాయికుమార్‌ కుమారుడు ఆది వివాహనం శనివారం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా, శర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా కళ్లేపల్లి, పీజే శర్మ పూర్తి పేరు పూడిపెద్ది జోగేశ్వర శర్మ. ఆదివారం సాయంత్రం మూడు గంటలకు శర్మకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 
 
పీజే శర్మగా తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితులై... సుమారు 500లకు పైగా సినిమాలకు నటుడుగాను, డిబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ, రచయితగానూ పని చేశారు. తెలుగు, తమిళం‌, కన్నడ చిత్రాల్లో శర్మ నటించారు. ఆయన నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. శర్మ నటించిన చివరి చిత్రం నాగ. శర్మ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ సంతాపం తెలియజేశారు. ‘మా’ అసోషియేషన్‌ శర్మ మృతిపట్ల సంతాపం ప్రకటించింది.