సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (12:46 IST)

రణ్‌బీర్‌తో వివాహం.. పెళ్లికి తర్వాత అలియాభట్ సినిమాల్లో కనిపిస్తుందా?

అలియాభట్ రణ్‌బీర్‌ని వివాహం చేసుకోబోతుందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో వివాహమైన తర్వాత అలియాభట్.. సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టనుందని టాక్ వస్తోంది. ఈ వార్తలపై అలియా భ

అలియాభట్ రణ్‌బీర్‌ని వివాహం చేసుకోబోతుందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో వివాహమైన తర్వాత అలియాభట్.. సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టనుందని టాక్ వస్తోంది. ఈ వార్తలపై అలియా భట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియాభట్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మాస్త్ర మావీలో వీళ్లిద్దరూ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సైట్స్‌పైకి రానుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కడచూసినా ఇద్దరు కలిసి కనిపించారు. అదే సమయంలో వీరిద్దరి పెళ్లి ప్రస్తావన కూడా కార్చిచ్చులా వ్యాపించింది.
 
వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. కానీ 2020 తర్వాత వీళ్ల పెళ్లి జరుగుతుందని కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అయితే రణబీర్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు అలియాభట్ ఫుల్ స్టాఫ్ పెడుతుందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అలియా ఏం చెప్పిందంటే.. తాను ఎన్నాళ్లు సినిమాల్లో నటించగలనో.. అన్ని రోజులు నటిస్తానని చెప్పింది.