శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (13:19 IST)

ఒసామా బిన్ లాడెన్ కుమారుడు పెళ్లి కొడుకాయనే..

గత సంవత్సరం జనవరిలో అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసిన.. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజ

గత సంవత్సరం జనవరిలో అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసిన.. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తెతో హంజా బిన్ లాడెన్‌కు పెళ్లి తంతు పూర్తయ్యిందని 'ది గార్డియన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబీకులు తెలిపారు.
 
ప్రస్తుతం తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నాడని, అయితే, అతనితో తమకు సంబంధాలు లేవని ఇంటర్వ్యూ ఇచ్చిన లాడెన్ కుటుంబీకులు స్పష్టం చేశారు. అల్‌ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు దిగవద్దని తాము హంజాను కోరుతున్నట్లు చెప్పారు. 
 
ఇదిలా ఉంటే, హంజా ఆచూకీని తెలుసుకునేందుకు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్ల పాటు తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి.