అవన్నీ వద్దు.. పుష్ప-2నే ముద్దు.. ఐకాన్ ప్రాజెక్టుకు నో

సోమవారం, 7 మార్చి 2022 (11:55 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురం సినిమా చేస్తున్న సమయంలోనే బన్నీ ఐకాన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఓకే చేశారు. 
 
పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. “పుష్ప” సినిమా రిలీజ్ అయిన వెంటనే.. బన్నీ ఐకాన్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే  తాజాగా బన్నీ ఐకాన్ ప్రాజెక్టుని వదులుకున్న ట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పుష్ప క్రేజ్‌ను సద్వినియోగం చేసుకునే దిశలో పుష్ప-2 షూటింగ్‌లో బన్నీ బిజీ బిజీగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో తనకంటూ సపరేట్ గుర్తింపు తీసుకురావడంతో ఇప్పుడు బన్నీ దృష్టి మొత్తం రెండో భాగం పెట్టినట్లు.. దీంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని… కుర్ర స్టార్ హీరో రామ్ పోతినేని తో చేయనున్నట్లు సమాచారం. 
 
పుష్ప చేస్తున్న సమయంలో.. బన్నీ లైకా ప్రొడక్షన్స్ లో ఓ భారీ సినిమా తో పాటు 'ఐకాన్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బోయపాటి దర్శకత్వంలో కూడా బన్నీ చేయడానికి రెడీ అయినట్లు మీడియాలో న్యూస్ వైరల్ కావడం జరిగింది. 
 
కానీ బన్నీ మాత్రం "పుష్ప" మొదటి భాగం భారీ రేంజ్ లో హిట్ కావడంతో సెకండ్ పార్ట్.. అదే స్థాయిలో విజయం సాధించాలని మిగతా ప్రాజెక్టులన్నీ పక్కనపెట్టి… పుష్ప పార్ట్2 పైన కాన్సెంట్రేషన్ పెట్టినట్లు సమాచారం.

అన్నీ చూడండి

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి

పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో

అన్నీ చూడండి

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ

గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?

Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments