బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (16:25 IST)

తండ్రీ కొడుకులుగా అమితాబ్‌, ప్ర‌భాస్‌!

Amitab-Prabhas
మ‌హాన‌టి`  ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నేతృత్వంలో రూపొందుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పాట‌ల‌ను స్వ‌ర్గీయ సీతారామ శాస్త్రి రాశారు. వాటికి ఇంకా ట్యూన్ క‌ట్టాల్సివుంది. అయితే ఈ సినిమాలో ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో పెద్ద వ్యాపార‌వేత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న కొడుకుగా ప్ర‌భాస్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకోని న‌టిస్తోంది. ఈమె అమితాబ్‌కు స‌హాయ‌కురాలిగా న‌టిస్తోంద‌ట‌.
 
వైజ‌యంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వ‌నీద‌త్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా దీపికా ప‌దుకోని న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ప్ర‌క్రియ చూపించ‌బోతున్నాడ‌నే వార్త కూడా వినిపిపిస్తోంది. ఫ్లాష్ బేక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌కానున్న‌ద‌ని స‌మాచారం.