మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (20:14 IST)

రవితేజ సరసన హాట్ యాంకర్ అనసూయ (Video)

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... రవితేజ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
 
మారుతితో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో కూడా ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమాలకి సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయి.
 
 అయితే.... ఇటీవల రవితేజ కొత్త సినిమా ఖిలాడి స్టార్ట్ అయ్యింది. దీనికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం ఇద్ద‌రు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసేశారు. ఇప్పుడు మ‌రో పాత్ర కోసం హాట్ యాంకర్‌ను సెలెక్ట్ చేసారని తెలిసింది. ఎవరా హాట్ యాంకర్ అంటారా..? ఒకప్పటి యాంకర్.. ఇప్పుడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ‌ని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసారని తెలిసింది.
 
ఈ సినిమాలో అన‌సూయ చాలా హాట్‌గా ఉండ‌బోతోంద‌ట‌. ఈ సినిమాతో అనసూయకు మ‌రో ర‌క‌మైన ఇమేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని టీమ్ చెబుతన్నారట. మరి.. ఈ సినిమాతో అనసూయ ఇమేజ్ మారుతుందేమో చూడాలి.