సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (19:19 IST)

నాగార్జున సరసన అనుష్క.. స్వీటీకి ''సూపర్'' ఛాన్స్

''మహానటి''లో భానుమతిగా భాగమతి హీరోయిన్ అనుష్క నటించనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్‌లో నటించే ఛాన్సును కైవసం చేసుకుంది. ప్రముఖ నిర్మాత అశ

''మహానటి''లో భానుమతిగా భాగమతి హీరోయిన్ అనుష్క నటించనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్‌లో నటించే ఛాన్సును కైవసం చేసుకుంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కే చిత్రంలో నాగార్జున, నాని నటిస్తున్నారు. 
 
ఇందులో నాగ్‌కు జోడీగా అనుష్క నటించనుందని సమాచారం. మరో హీరోగా అయిన నాని ఇందులో డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నాగార్జున ''సూపర్'' సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమైన అనుష్క, ఆపై డాన్, రగడ, ఢమరుకం వంటి సినిమాల్లో నాగ్ సరసన నటించిన సంగతి తెలిసిందే.