సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:29 IST)

బిగ్ బాస్-2: యంగ్ టైగర్ వెనక్కి.. నేచురల్ స్టార్ నాని ఎంట్రీ?

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు. సినిమాల ద్వారా భారీ కలెక్షన్లు సాధిస్తున్న నాని.. నిర్మాతగానూ అవతారం ఎత్తాడు. ఇటీవల విడుదలైన నాని ''అ'' సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది.

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు. సినిమాల ద్వారా భారీ కలెక్షన్లు సాధిస్తున్న నాని.. నిర్మాతగానూ అవతారం ఎత్తాడు. ఇటీవల విడుదలైన నాని ''అ'' సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నానికి ఓ బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. బిగ్ బాస్ సీజన్-2కు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
బిగ్ బాస్-1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇక రెండో షెడ్యూల్‌కి ఆయనే యాంకర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిజీ సినిమా షెడ్యూల్ కారణంగా బిగ్ బాస్ నుంచి ఆయన తప్పుకోవడంతో.. ఎన్టీఆర్ స్థానంలో క్రేజున్న నానిని తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారని తెలిసింది. 
 
ఇందులో భాగంగా మా టీవీ నిర్వాహకులు నానితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఫా ఉత్సవంలో నాని.. రానాతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ షోకు మంచి రేటింగ్ రావడంతో.. మా టీవీ నానిని బిగ్ బాస్ రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా ఖరారు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.