గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (17:50 IST)

కమల్‌కు విజయ్ కాంత్ మద్దతు.. రజనీ కూడా త్వరలోనే ఆ పని చేస్తారు.. ఇక సీఎం ఆయనే?

తమిళనాడు సర్కారుపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కమల్‌కు పలువురు సెలెబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. తాజాగా న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ మద్దతు పలికారు. జయలలిత మరణానిక

తమిళనాడు సర్కారుపై సినీ లెజెండ్ కమల్ హాసన్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కమల్‌కు పలువురు సెలెబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. తాజాగా న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ మద్దతు పలికారు. జయలలిత మరణానికి అనంతరం నటుడు కమల్ హాసన్ తమిళ సర్కారు అవినీతిని ఎండగట్టడం శుభపరిణామని చెప్పారు. జయలలిత ప్రాణాలతో ఉన్నప్పుడు నోరు మెదపని కమల్ హాసన్ ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మంత్రి ఒకరు చేసిన కామెంట్‌పై విజయ్ కాంత్ స్పందించారు. 
 
మంత్రులను ఉద్దేశించి విజయ్ కాంత్ మాట్లాడుతూ.. అమ్మ ఉన్నప్పుడు మంత్రులు కూడా నోరు విప్పలేదే అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న‌ రాజ‌కీయాల గురించి క‌మ‌ల్ నిజం మాట్లాడారని విజయ్‌కాంత్ ప్రశంసించారు. మరోవైపు త్వరలో కమల్ హాసన్‌కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతిచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
అంతేగాకుండా కమల్ హాసన్ కూడా త్వరలో తన అభిమానులను కలువనున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. రజనీకాంత్ కొత్త పార్టీ లేదని.. కమల్ హాసన్‌కే సినీ నటులంతా ఏకంగా మద్దతిస్తారని.. కమలే తదుపరి సీఎం అవుతారని కోలీవుడ్‌లో టాక్. కమల్ హాసన్‌కు రజనీకాంత్ సపోర్ట్ చేస్తే.. ఆయన ఫ్యాన్స్ కమల్ వెంటే వుంటారని.. తద్వారా.. తమళ ప్రజల కోసం కొత్త పార్టీ ఏర్పాటు కానుందని సినీ వర్గాల్లో సమాచారం.