బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (12:56 IST)

బెంగుళూరులో ఆంధ్రా విద్యార్థిని దారుణ హత్య

murder
కర్నాటక రాష్ట్రం బెంగుళూరు నగరంలో ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్యి జిల్లాకు చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కళాశాలలో చదువుతూ అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాల చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోది హత్య చేసినట్టు మాదనాయనకహళ్లి పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. 
 
పైగా, ప్రేమవర్ధన్ పరారీలో ఉండటంతో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దేవశ్రీ తల్లిదండ్రులు రెడ్డప్ప, జగదాంబలు కుమార్తె మరణవార్త తెలిసి బోరున విలపిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి తిరిగి వస్తుందన్న భావించిన వారు... కుమార్తె మరణవార్తను జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నారు.