"వకీల్ సాబ్" కలెక్షన్లపై కరోనా ప్రభావం?

Written By ఠాగూర్
Updated: బుధవారం, 14 ఏప్రియల్ 2021 (18:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "వకీల్ సాబ్". ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ 'వకీల్ సాబ్' ప్రయాణం తొలి ఐదు రోజులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. 
 
ఒకవైపు వైరస్ విజృంభిస్తున్నా కూడా మరోవైపు థియేటర్లకు అభిమానులు, ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కరోనా వైరస్ అనే విషయాన్ని కూడా వాళ్లు మరిచిపోయారు. అందుకే కలెక్షన్లు కూడా అద్భుతంగా వచ్చాయి. 
 
పైగా ఉగాది సెలవులు కూడా రావడంతో తొలి ఐదు రోజులు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు వకీల్ సాబ్. అయితే ఆ రోజు నుంచి ఈ సినిమా దూకుడు తగ్గింది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్స్ నెమ్మదించాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
 
వైరస్ ఉన్నా కూడా పవర్ స్టార్ మేనియాతో తొలి ఐదు రోజులు ఎదురు లేకుండా వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసేయడం.. మరోవైపు రోజురోజుకు కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అందుకే 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయని సమాచారం. 
 
మ్యాట్నీస్ కూడా 50 శాతం మాత్రమే ఫుల్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఉగాది పర్వదిన రోజున 'వకీల్ సాబ్' తెలుగు రాష్ట్రాల్లో కలెషన్ల పరంగా కుమ్మేసింది. సెలవు రోజు కావడంతో దాదాపు రూ.9 కోట్ల షేర్ తీసుకొచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే దాదాపు రూ.76 కోట్లు వకీల్ సాబ్ వసూలు చేసిందని తెలుస్తోంది. 
 
ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే రూ.90 కోట్లు వసూలు చేయాలి. వైరస్ కారణంగా ఇప్పటికే సినిమాలన్నీ వాయిదా వేస్తూ ఉండడంతో ప్రేక్షకులకు పవన్ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు. అలాగే మెల్లగా నడుస్తూ నడుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటుందని డిస్ట్రిబ్యూటర్లు బలంగా నమ్ముతున్నారు.
 
ఏదేమైనా కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి.. దానికి ఎదురు నిలిచి ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం మాత్రం చిన్న విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరో చేయని సాహసం చేశాడు. 

అన్నీ చూడండి

రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి

సస్పెండ్ చేశారనీ రైలుకింద పడి తాహసీల్దారు ఆత్మహత్య

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

అన్నీ చూడండి

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం

కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం

రేలా ఆస్పత్రిలో అద్భుత ఆవిష్కరణ - 97 యేళ్ల వృద్ధుడికి బెలూన్‌తో భుజం సర్జరీ

క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి

తర్వాతి కథనం
Show comments