దేశంలో సెకండ్ వేవ్ పీక్స్ : 1.84 లక్షలు దాటిన కొత్త కేసులు
భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. కరోనా ప్రభావం దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఒక్క రోజులోనే భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,84,372 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 82,339 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
ఇక 24 గంటల్లో కరోనా వైరస్ ప్రభావం 1,027 మంది ప్రాణాుల కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 13,65,704 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఈ కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,38,73,825 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,23,36,036 మంది కరోనాను జయించి సురక్షితంగా ఉన్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,085 ప్రాణాలు కోల్పోయారు.
ఇదేసమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 11,11,79,578 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.
తెలంగాణలో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 2,157 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 821 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,07,499 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,780గా ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం 25,459 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,892 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 361 మందికి కరోనా సోకింది.