శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:01 IST)

11 రోజుల పసిపాపకు కరోనా పాజిటివ్.. వెంటిలేటర్‌పై ప్లాస్మా చికిత్స

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ కరోనా పసిబిడ్డలను కూడా వదలట్లేదు. ఈ క్రమంలో ఓ పసిబిడ్డకు పుట్టిన ఐదు రోజులకే కరోనా సోకింది. దీంతో పసిబిడ్డకు చికిత్సనందిస్తున్నారు. 
 
ఇప్పుడా ఐదు రోజుల పసిపాపకు 11 రోజులు. గుజరాత్‌లోని సూరత్‌లో 11 రోజుల నవజాత శిశువుకు కరోనా చికిత్స చేస్తున్నారు. ఆ శిశువు జన్మించిన ఐదవ రోజున కరోనాకు గురైంది. ఈ శిశువుకు తల్లి నుంచే కరోనా సంక్రమించి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.
 
గుజరాత్‌లోని అమ్రెలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల గర్భిణిని ఏప్రిల్ 1 తేదీన ప్రసవం కోసం డైమండ్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆ బిడ్డ పుట్టిన ఐదు రోజులకే ఏప్రిల్ 6న పాప శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో పరీక్షలు చేయగా కరోనా సోకినట్లుగా తేలింది. దీంతో పసిబిడ్డకు వెంటిలేటర్ పై చికిత్సనందిస్తున్నారు.
 
శ్వాస తీసుకోవటంతో శిశువు ఇబ్బంది పడుతుండటంతో చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. చిన్నారికి రెమిడెసివిర్ ఇంజిక్షన్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారికి ప్లాజ్మా చికిత్స అందించనున్నామని.. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.