గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:48 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా : ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా వైరస్ సోకింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
అదేవిధంగా, మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా కరోనా వైరస్ సోకింది. అలాగే, టీడీపీ నేత దామంచర్ల సత్యను కరోనా వైరస్ కాటేసింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలకు ఈ వైరస్ సోకింది. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో తక్షణం 25 లక్షల వ్యాక్సిన్లను ఇవ్వాలని కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.