మామ తర్వాత అల్లుడితో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ....
కబాలీలో రజనీ కాంత్ సరసన నటించిన బాలీవుడ్ భామ రాధిక ఆప్టే ఇప్పుడు ఆయన అల్లుడు ధనుష్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కబాలి హిట్‌తో రాధికా సౌత్‌లో కూడా విపరీతమైన
కబాలీలో రజనీకాంత్ సరసన నటించిన బాలీవుడ్ భామ రాధిక ఆప్టే ఇప్పుడు ఆయన అల్లుడు ధనుష్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కబాలి హిట్‌తో రాధికా సౌత్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇదిలాఉంటే... ప్రస్తుతం ధనుష్ ''వడ చెన్నై'', ''ఎన్నై నోక్కి పాయుం తొట్టా'' చిత్రాల షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నాడు. అనంతరం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో ధనుష్ తన తదుపరి సినిమాను చేయనున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో రాధికా ఆప్టే నటించనున్నట్లు సమాచారం.
మరోపక్క ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'ఆల్ ఫాసినో' అనే హాలీవుడ్ స్టార్‌ను సంప్రదిస్తున్నారట. 'గాడ్ ఫాదర్' సిరీస్‌తో పాటు ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో ఆయన నటించాడు. ఆయన అంగీకరిస్తే ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుందని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. నేచురల్ స్టార్‌గా పేరున్న ధనుష్ కూడా పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంపిక చేసుకుంటాడు. రాధికా ఆప్టేకు సూటయ్యే క్యారెక్టర్ కాబట్టే ఆమెను తీసుకుని ఉంటారని, ధనుష్ జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్టుగానే ఉంటుందని సినీనిపుణులు అంటున్నారు.