Daily Horoscope
✕

పెళ్లి పీటలెక్కనున్న 'లూసిఫర్' దర్శకుడు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 3 జూన్ 2020 (14:52 IST)
రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దర్శకుడు సుజిత్. ఆ సినిమా సూపర్‌గా నచ్చడంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తనను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సుజిత్‌కు ఇచ్చాడు. ఫలితంగా సాహో చిత్రం వచ్చింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కలెక్షన్ల పరంగా అదరహో అయినప్పటికీ.. టాక్ పరంగా నిరాశపరిచింది. 
 
అయినప్పటికీ సుజిత్‌కు మరో మెగా ఛాన్స్ లభించింది. మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను సుజిత్‌కు చిరంజీవి అప్పగించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్టును తయారు చేసే పనిలో నిమగ్నమైవున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవళ్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని సమాచారం. ఈ నెల పదో తేదీన ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. 

అన్నీ చూడండి

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

చెక్ బౌన్స్ కేసు : నిర్మాత బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష కేసు సుఖాంతం! పిటిషనర్ వీడియో

ప్రయాణికులకు అలెర్ట్ : వందే భారత్ రైలు ఎక్కే ముందు ఇవి తెలుసుకోండి...

ఆస్తిపాస్తులు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments