అమీర్‌ఖాన్‌ కుమార్తె ప్రేమలో పడిందా? అమ్మ కూడా ఓకే చెప్పిందా?

Ira Khan
సెల్వి| Last Updated: బుధవారం, 25 నవంబరు 2020 (09:32 IST)
Ira Khan
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమలో పడినట్లు బిటౌన్ వర్గాలు కోడైకూస్తున్నాయి. మిషాల్‌ అనే వ్యక్తితో కొంతకాలంపాటు రిలేషన్‌లో ఉన్న ఐరా.. పలు సందర్భాల్లో అతనిపై ఉన్న ప్రేమను సోషల్‌మీడియా వేదికగా తెలియజేసింది. అయితే మిషాల్‌-ఐరాల మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ గతేడాది విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఐరాఖాన్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో తాజాగా ప్రేమలోపడినట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

గతకొన్నేళ్లుగా అమీర్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్‌ లాక్‌డౌన్‌ నుంచి ఐరాకు సైతం వర్కౌట్ల విషయంలో కోచ్‌గా మారారు. అయితే, నుపూర్‌ వ్యక్తిత్వం నచ్చడంతో ఐరా అతనితో ప్రేమలోపడిందని తెలుస్తోంది.

అంతేకాకుండా ఐరా ఇప్పటికే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నారని సమాచారం. వీరిద్దరికీ సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.దీనిపై మరింత చదవండి :