నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా ఆగిందా? అందుకే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ లైన్లోకి వచ్చాడా?

గురువారం, 13 ఆగస్టు 2020 (23:21 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. అయితే... ఇటీవల ప్రభాస్.. మహానటి సినిమాతో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
ఈ సంచలన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. 
 
అయితే... నాగ్ అశ్విన్‌తో చేయనున్న మూవీని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఇంకా ఆలస్యం అవచ్చు అని వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే... అభిమానులు షాక్ అయ్యే ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌లో హీరో ఎన్టీఆర్ అనుకున్నారు. తాజాగా ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ స్టోరీ రెడీ చేసారట. 
 
నాగ్ అశ్విన్‌తో అనుకున్న ప్రాజెక్ట్ ఆలస్యం అయితే... ప్రశాంత్ నీల్‌తో సినిమాని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. మరి.. నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తారా..? లేక ప్రశాంత్ నీల్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా...? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

అన్నీ చూడండి

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments