సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (14:05 IST)

పెద్ద ఎన్టీఆర్ కోసం కాజల్ అగర్వాల్‌ను అడుగుతున్నారట...

కాజల్ అగర్వాల్. టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వచ్చారు. ఈ నేపద్యంలో ఆమె ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు అంగీకరించారనీ, సినిమా చాన్స్ వచ్చినప్పుడల్లా ఇలా తిరుమల శ్రీవారిని దర్శించు

కాజల్ అగర్వాల్. టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వచ్చారు. ఈ నేపద్యంలో ఆమె ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు అంగీకరించారనీ, సినిమా చాన్స్ వచ్చినప్పుడల్లా ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటయా అంటే... ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్రట.
 
తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు కాబట్టి ఆమెను కూడా చూపించాలని తేజ డిసైడ్ అయ్యారట. అందుకోసం జయ పాత్రలో కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరి ఈ ఆఫర్‌ను కాజల్ అంగీకరిస్తుందో లేదో చూడాలి.