సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (19:24 IST)

అనుష్క బాటలో నయనతార.. కెవిన్‌తో రొమాన్స్ ఓవర్ డోస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క బాటలో మరో సీనియర్ నటి నయనతార గేర్ మార్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళంలో తనకంటే చిన్నవాడు అయినా కెవిన్‌తో నయన్ నెక్స్ట్ సినిమాలో రొమాన్స్ చేయనున్నట్టు గాసిప్స్ వస్తున్నాయి. 
 
కాగా ఇది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలా కాకుండా రొమాన్స్ కూడా గట్టిగానే ఉండే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని అయితే ఇదవన్ విష్ణు అనే కొత్త దర్శకుడు చేయనున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో టాక్. 
 
ఇకపోతే.. తనకంటే చిన్నవాడు అయిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" అనే రోమ్ కామ్ సినిమా చేసింది అనుష్క. ప్రస్తుతం ఇదే తరహాలో కెవిన్‌తో నయన్ నటించనుందని.. ఇందులో రొమాన్స్ మాత్రం ఓవర్ డోస్ అవుతుందని కోలీవుడ్ వర్గాల బోగట్టా.