1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (10:08 IST)

ఆ సినిమాకు సీక్వెల్‌ గా చిరంజీవి 156 ` కోలుకున్న తర్వాత షూట్‌లోకి వెళ్లనున్న చిరంజీవి?

chru 156 poster
chru 156 poster
మెగాస్టార్‌ చిరంజీవి 156వ సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే జర్నరలిస్టుల బుక్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మనసులోని మాటను ఆవిష్కరించారు. తనకు ఎప్పటినుంచో జగదేగవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌గా చేయాలనుందని వెల్లడించారు. అందుకే ప్రస్తుతం 156వ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. ఇందుకు దర్శకుడు వశిష్ట ఆ తరహా కథను తయారు చేసుకున్నారు.
 
156వ చిత్ర కథ జగదేకవీరుడుకు మించిన అద్బుతాలు ఇందులో కనిపిస్తాయని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్లుగా అనుష్క, నయనతార, మృణాల్ ఠాగూర్ పేర్లు పరిశీలనలో వున్నాయి. అయితే మొత్తంగా ఆరుగురు హీరోయిన్లు కథ రీత్యా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం చిరంజీవి నవంబర్‌ 6వ తేదీవరకు వరుణ్‌ తేజ్‌, లావణ్య వివాహం పనులలో బిజీగా వున్నారు.  ఆ తర్వాత చిరంజీవి చిన్నపాటి శస్త్ర చికిత్స చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మోకాలి నొప్పితో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న చిరు రెండునెలలపాటు రెస్ట్‌ తీసుకున్నాక జనవరిలో సంక్రాతికి షూటింగ్‌కు హాజరుకానున్నారని సమాచారం.