ఐ బ్రోస్ తేడాగా వుందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు...
కాన్పూర్‌లోని ఓ ముస్లిం మహిళ సౌదీ అరేబియా నుంచి ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుల్సైబా అనే మహిళ జనవరి 2022లో సలీమ్‌ను వివాహం చేసుకుంది. అతను ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు.
గుల్సైబా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగస్టు 30న తన భర్త సౌదీ అరేబియా వెళ్లిన తర్వాత అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. తన భర్త "పాత ఫ్యాషన్" అని, ఆమె ఫ్యాషన్ ఎంపికలపై అభ్యంతరాలు లేవనెత్తిందని ఆమె పోలీసులకు తెలిపింది.
తన ఐబ్రోస్‌తో అభ్యంతరం వ్యక్తం చేస్తూ తలాక్ చెప్పాడని పోలీసులకు వెల్లడించింది. గుల్సైబా ఫిర్యాదు మేరకు ఆమె భర్తతో పాటు ఆమె అత్తగారితో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
"నాకు పెళ్లయి ఏడాది మాత్రమే అయింది. గతంలో నన్ను అగౌరవపరిచిన నా భర్త ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. అతనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని ఆమె తెలిపారు.