గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (09:50 IST)

జిమ్‌లో భారతీయ విద్యార్థికి కత్తిపోటు

knife
అమెరికాలోని ఓ జిమ్‌లో భారతీయ విద్యార్థి కత్తిపోటుకు గురయ్యాడు. ఇండియానాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో రెగ్యులర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల వరుణ్ ఆదివారం ఉదయం కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ దాడి తర్వాత వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
24 ఏళ్ల జోర్డాన్ ఆండ్రేడ్‌ను అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. ఆండ్రేడ్‌ను పోర్టర్ కౌంటీ జైలులో ఉంచారు. వరుణ్ ఇప్పుడు ఇండియానాలోని ఫోర్ట్ వేన్స్ లూథరన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.