శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 10 మే 2021 (22:10 IST)

కెజిఎఫ్-2 ఇక అంతేనా..?

కెజిఎఫ్ సినిమా.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలో భారీ రికార్డ్. యాక్షన్, థ్రిల్లర్, సెంటిమెంట్‌ను కలగలిపిన మొదటి ఎపిసోడ్ కెజిఎఫ్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమా తరువాత సీక్వెల్ రెండవ భాగం వస్తుందని డైరెక్టర్ ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
 
కరోనాకు ముందే రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. దాదాపుగా పూర్తయ్యే సమయంలో కరోనా వచ్చేసింది. సీక్వెల్‌లో సంజయ్ దత్, రవీనా టాండన్‌లు నటిస్తున్నారు. ఇక రాఖీబాయ్ క్యారెక్టర్ గురించి చెప్పనవసరం లేదు. మొదటి భాగంలో ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.  
 
అయితే అంతకుమించిన యాక్షన్ రెండవ భాగంలో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో అభిమానులు ఎంతో ఆతృతగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్సన్ వర్క్ జరుగుతోంది. అయితే సినిమా మొదట్లో రెండున్నర గంట అనుకున్నారు గానీ సినిమాను 3 గంటల పైన ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోందట.
 
అద్భుతమైన స్క్రిప్ట్‌తో అందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందట. అయితే మిగిలిన సినిమాల కన్నా ఎక్కువసేపు ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి సమాచారం రావడంతో అభిమానులు మూడు గంటలు కాదు నాలుగు గంటలైనా థియేటర్లో కూర్చోవడానికి సిద్థమంటూ చిత్ర యూనిట్ సభ్యులకు సందేశాలు పంపుతున్నారట. మరి చూడాలి రెండవ భాగం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకోబోతుందన్నది.