శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (18:27 IST)

కేజీఎఫ్ చాప్టర్ 2 బిజినెస్ అదుర్స్.. రూ.160 కోట్ల మార్కును..?

దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన కేజీఎఫ్ సినిమా గురించి తెలిసిందే. 2018 డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాతో కన్నడ హీరోగా యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. 
 
దర్శకుడు కూడా జాతీయ స్థాయి డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. కేజీఎఫ్2గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అది పక్కన పెడితే ఈ సినిమా థియేటిరికల్ విడుదల కాకుండానే భారీ బిజెనెస్ చేసింది. 
 
ఈ సినిమా తెరకెక్కనున్న అన్ని భాష్లలో కలిపుకొని దాదాపు రూ.160 కోట్ల మార్క్‌ను దాటిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దాదాపు రూ.55 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 
 
జులై 16న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. వీరితో పాటు రవీనా టాండన్, శ్రీనిథి శెట్టి, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్‌లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అందరిలోనూ తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.