మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (18:57 IST)

బాలయ్య సరసన కేజీఎఫ్ హీరోయిన్?

Srinidhi Shetty
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన కేజీఎఫ్‌తో శ్రీనిధి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న శ్రీనిధికి తాజాగా టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
శ్రీనిధి శెట్టికి తమిళం నుంచి కూడా భారీ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అది పెద్దగా సహాయం చేయలేదు. తాజాగా టాలీవుడ్ ఆఫర్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాబోయే ఇంకా పేరు పెట్టని చిత్రంలో కీలక పాత్రను పోషించడానికి శ్రీనిధి శెట్టిని సంప్రదించారు.
 
బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు. మేకర్స్ ఇప్పటికే శ్రీనిధి శెట్టికి కథను వినిపించారు. ఇందుకు శ్రీనిధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వస్తోంది.