ప్రభాస్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్
రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. సలార్ సాంకేతిక కారణాలవల్ల వాయిదా పడింది. ఇంకోవైపు ప్రాజెక్ట్ కె. సినిమా షూట్ కూడా ఇంకా పూర్తికాలేదు. మరోవైపు మారుతీ దర్శకత్వంలో మరో సినిమా వుంది. ఇలా వరుస సినిమాలు వున్న ప్రభాస్‌కు గతంలోనే మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసిందే. దానికి శస్త్రచికిత్స చేసుకోవాలని డాక్టర్లు ధృవీకరించడంతో విదేశాలకు వెళ్ళాల్సివచ్చింది. గతంలోనే ఆయన ఒకసారి విదేశాలకు వెళ్ళి వచ్చారు.
ఇప్పుడు రెండోసారి ఆయన విదేశాలకు వెళ్ళారు. అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతుందని సమాచారం. కనుక వెంటనే డిశ్చార్ట్ లేదని కొద్దిరోజులు రెస్ట్‌మోడ్‌లో వుండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత ఆయన ఇండియాకు వచ్చే అవకాశం వుందని సన్నిహితులు తెలియజేస్తున్నారు. అనంతరం ఆయన ఇండియా వచ్చి పాన్ ఇండియా సినిమాల షూటింగ్‌లో పాల్గొనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.