శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (18:06 IST)

పవన్ సరసన నటించేందుకు ఆ హీరో కాల్షీట్లు తగ్గించిన పూజా హెగ్డే? (Video)

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. పింక్ అనే సినిమాను రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. ఇందులో ఒక హీరోయిన్ నివేదితా థామస్ ఇప్పటికే కన్ఫామ్ అయిపోయింది. ఆమె తన కాల్షీట్లను కూడా ఇచ్చేసింది. ఇక మరో హీరోయిన్ కోసం డైరెక్టర్ వెతకసాగారు. అయితే ఆ హీరోయిన్ ఛాన్స్ పూజా హెగ్డేను వరించింది.
 
అయితే మొదట్లో తనకు కాల్షీట్లు లేవని.. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని పూజా చెప్పింది. ప్రభాస్‌తో ఒక సినిమా మరో సినిమా షూటింగ్ ప్రారంభం.. ఇలా ఉండటంతో తాను బిజీ అయిపోయానని చెప్పుకొచ్చిందట. దీంతో సినీ యూనిట్‌కు నిరుత్సాహం ఏర్పడింది. అయితే హీరో పవన్ కళ్యాణ్ అని తెలిసిన తర్వాత వెంటనే కాల్షీట్లు ఇచ్చేస్తానంటూ చెప్పేసిందట పూజా.
 
పవర్ స్టార్‌తో జతకట్టడం పూజాకు ఎంతో ఇష్టమట. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ సినిమాతో ఉన్న కాల్షీట్లను తగ్గించి ఆ కాల్షీట్లు పవన్ కళ్యాణ్ సినిమా కోసం సర్దుబాటు చేస్తోందట. ఇప్పటికే కాల్షీట్లను సిద్ధం చేయమని పిఎకు కూడా చెప్పేసిందట పూజా. ప్రస్తుతం బిజెపితో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న పవన్‌ కళ్యాణ్ అది కాస్త పూర్తయిన తరువాత మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారట. ఈ నెల 26వ తేదీన ఆయన మేకప్ వేసుకోవడం ఖాయమంటున్నారు సినీవర్గాలు.