మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (15:47 IST)

పవర్ స్టార్ సరసన బుట్టబొమ్మ... సూపర్ కాంబో అట..?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా పేరున్న పూజా హెగ్డే.. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నాడు. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి హిట్ ఇచ్చిన కారణంగా ఆయనతో సినిమా చేయడానికి పవన్ అంగీకరించాడు. 
 
ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు పూజ హెగ్డే కెరియర్ ఊపందుకున్నదే హరీశ్ చేసిన 'దువ్వాడ జగన్నాథం'తో అనే విషయం తెలిసిందే. ఆపై అల్లు అర్జున్, చెర్రీకి జోడీగా నటించింది. ప్రస్తుతం పవన్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
ప్రస్తుతం పవన్ కల్యాణ్ .. ఇటు 'భీమ్లా నాయక్' .. అటు 'హరి హర వీరమల్లు' సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే హరీశ్ శంకర్ సినిమా షూటింగు కూడా మొదలుకానుంది. పవన్ బర్త్ డే కానుకగా టైటిల్ ను ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.