1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (12:06 IST)

మెగా ఫ్యామిలీ కోసం వీరాభిమాని సైకిల్ యాత్ర

తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న మెగా ఫ్యామిలీ బాగుండాలని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడై పోవాలని కోరుతూ తిరుపతిలోని బలిజపల్లికి చెందిన ఈశ్వరయ్య సైకిల్ యాత్ర చేశాడు. 
 
ఈ నెల 10వ తేదీన శ్రీవారి పాదాల చెంత అయిన అలిపిరి వద్ద నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగింది. 
 
ఈ సైకిల్ యాత్రపై ఈశ్వరయ్య మాట్లాడుతూ, గతంలో కూడా మెగా ఫ్యామిలీ కోసం అనేక పూజలు, పునస్కారాలు చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల వద్ద పొర్లుదండాలతో మొక్కులు తీర్చుకున్నట్టు చెప్పారు. 
 
తాను ఒక పవన్ కల్యాణ్ వీరాభిమానని, తమ అభిమాన నేతకు కరోనా సోకడంతో కలత చెంది ఆయనతో పాటు ఈ దేశ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ సైకిల్ యాత్రను చేపట్టినట్టు తెలిపారు. ఈ యాత్ర విజయవంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందన్నారు.