శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (11:02 IST)

కీర్తి సురేష్‌కు రూ.2కోట్ల వరకు ఇచ్చేందుకు రెడీగా వున్నారట..

హీరోయిన్ కీర్తి సురేష్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందంతో పాటు అభినయం ఒకే చోట దొరికితే ఇంకేముంది..? అందుకే కీర్తి సురేష్‌కు కోటిన్నర నుంచి రెండు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో

హీరోయిన్ కీర్తి సురేష్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందంతో పాటు అభినయం ఒకే చోట దొరికితే ఇంకేముంది..? అందుకే కీర్తి సురేష్‌కు కోటిన్నర నుంచి రెండు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుందట. ఇటు తెలుగు, అటు తమిళంలో క్షణం తీరిక లేనంత బిజీగా కీర్తి సురేష్ ఉంది. 
 
ప్ర‌స్తుతం ప‌వ‌న్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సినిమాలో న‌టిస్తోంది. సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిస్తున్న ''మ‌హాన‌టి'' చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తోంది. త‌మిళ ప‌వ‌ర్‌స్టార్ విజ‌య్ స‌ర‌స‌న వేరొక చిత్రంలో న‌టిస్తోంది. పలువురు నిర్మాతలు కీర్తి కాల్షీట్ల కోసం సీరియస్‌గా ప్రయత్నించి విఫలమవుతున్నారట. చివరి వరకూ వేచి చూసి విసిగి వేసారి పోయి వెళ్ళిపోతున్నారట.