Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌న అసిస్టెంట్ల‌ను దూరం పెట్టిన రాఘ‌వేంద్ర‌రావు

Written By డీవీ
Updated: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (18:05 IST)
K. Raghavendra Rao
ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావుకు క‌రోనా 3వ‌ వేవ్‌లో వున్న ఒమిక్రాన్ వైరస్ సోకింది. దానితో మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న్ను క‌ల‌వాల‌ని వ‌చ్చిన‌వారిని క‌ల‌వ‌నీయ‌కుండా పంపించేశారు. క‌రోనా విష‌యంలో చాలా కేర్‌గా వుండే ప్ర‌ముఖుల్లో రాఘ‌వేంద్ర‌రావు ఒక‌రు. ఆయ‌న చాలా డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తుంటారు. అంటే గాలి ద్వారా సోకే వ్యాధి కాబ‌ట్టి చాలా జాగ‌త్ర‌గా వుండ‌మ‌ని త‌న యూనిట్ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు.


రాఘవేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ వెబ్ సిరీస్ న‌డుస్తుంది. క‌థా చ‌ర్చ‌ల్లో భాగంగా ఆయ‌న్ను క‌ల‌వాల‌ని వెళ్ళిన‌వారికే ఈ విష‌యం తెలిసింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. ఓ సీన్ చర్చించే విష‌యంలో చాలా దూరంగా వుండి వారితో మాట్లాడి పంపించేశార‌ట‌.

 
ఇప్ప‌టికే క‌రోనా రెండోసారి సోకిన ప్ర‌ముఖుల‌లో చిరంజీవి కూడా వున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఓమిక్రాన్ రేటు త‌గ్గుముఖం ప‌డుతున్న సూచ‌న‌లు క‌నిపించ‌డంతో తెలంగాణ‌లో స్కూల్స్ రీ ఓపెన్ చేశారు. అదేవిధంగా చిన్న నిర్మాత‌ల‌కు థియేట‌ర్ల పూర్తి కెపాసిటీతో వుండ‌డంతో వాటిని రిలీజ్ చేసే ప‌నిలో వున్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో పూర్తిగా క‌రోనా ఇబ్బందులు తొల‌గుతాయ‌ని సినీ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. ఎందుకైనా మంచిద‌ని ప‌లువురు త‌మ సినిమాల‌కు రెండు డేట్స్‌ను ఫిక్స్ చేసుకున్నారు.

అన్నీ చూడండి

జిల్లాకు ముగ్గురు మంత్రులున్న ఒరింగేదేమీ లేదు : తెలంగాణ జనసేన నేతలు

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎస్ఎస్ టోకెన్ల జారీ నిలిపివేత

మైనర్ బాలికపై నెలలు తరబడి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా : అభిజీత్ దీప్కే

ఫ్రీ బస్సుల్లో సీట్ల లొల్లి - జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

అన్నీ చూడండి

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

తర్వాతి కథనం
Show comments