మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (20:34 IST)

స‌ల్మాన్ ఖాన్‌తో మీటింగ్ వేసిన రాజ‌మౌళి

Rajamouli-kalabhirava
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తాజాగా బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో భేటీ అయ్యారు. కాల‌భైర‌వ‌తో క‌లిసి ఆయ‌న ముంబైలోని ఫిలింసిటీలో క‌లిసిన‌ట్లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. స‌ల్మాన్‌తో మీటింగ్ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌స్తూన్న ఫొటోలను స‌ల్మాన్ టీమ్‌ పోస్ట్ చేసింది. కానీ ఎందుకు క‌లిశాడు. ఏమిటి? అనే వివ‌రాలు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.
 
రాజ‌మౌళి తాజాగా చేసిన `ఆర్‌. ఆర్‌. ఆర్‌.` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. సంక్రాంతి బ‌రిలో దిగుతుంది. ఈ సినిమా త‌ర్వాత ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్లు ఆమ‌ధ్య ఓ ఇంట‌ర్వూలో ఆయ‌న తండ్రి ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు. బ‌హుశా దానికోస‌మేనా అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. మ‌రోవైపు మ‌హేస్‌బాబుతో కూడా సినిమా అనుకున్నారు. మ‌రి ఏది ఏమైనా త్వ‌ర‌లో క్రేజీ వివ‌రాలు తెలియ‌నున్నాయి.