శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (16:50 IST)

బిగ్‌బాస్‌-3లో రేణూ దేశాయ్... పవన్ ఫ్యాన్స్ ఏమంటారో?

ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఆధ్వర్యంలో సాగిన బిగ్‌బాస్ మొదటి, రెండు సీజన్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. నిర్వాహకులకు లాభాల పంటను పండించాయి. దీంతో మూడో సీజన్‌ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్ మూడో సీజన్‌లో సందడి చేయనున్న సెలెబ్రిటీలు వీరేనంటూ పేర్లు వినిపిస్తున్నాయి. 
 
ఇందులో సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌తో పాటు టీవీ యాంకర్ ఉదయభాను, నటిమణులు శోభిత ధూళిపాల, గద్దె సింధూర, యూట్యూబ్ స్టార్ జాహ్నవి, హీరో వరుణ్ సందేశ్, కమల్ కామరాజు, జాకీ, హేమచంద్ర, రఘు మాస్టర్, జబర్దస్త్ పొట్టి నరేశ్ తదితరులు పాల్గొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఇకపోతే, ఈ మూడో సీజన్‌కు వ్యాఖ్యాత (హోస్ట్)గా మెగాస్టార్ చిరంజీవి లేదా విక్టరీ వెంకటేష్‌లలో ఎవరో ఒకరు వ్యవహించవచ్చనే వార్తలు వస్తున్నాయి. గతంలో తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు హీరో నానిలు హోస్ట్‌గా వ్యవహరించినచ విషయం తెల్సిందే.