శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (20:17 IST)

నాగార్జున కొత్త సినిమాని ప్ర‌క‌టించేది ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల‌తో ఓ సినిమా, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఇక బాల‌య్య ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఆత‌ర్వాత బోయ‌పాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
 
ఇక వెంక‌టేష్ ఎఫ్ 2 అంటూ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆత‌ర్వాత నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇలా టాప్ స్టార్స్ చిరు, బాలయ్య‌, వెంకీ బిజీగా ఉన్నారు. నాగ్ హిందీలో బ్ర‌హ్మ‌స్త అనే సినిమాలో స్పెష‌ల్ రోల్ చేస్తున్నారు. త‌మిళ సినిమా చేస్తున్నారు కానీ.. తెలుగులో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా చేయ‌నున్నారో ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి... ఎప్పుడు ప్ర‌క‌టిస్తాడో చూడాలి.