గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శనివారం, 18 నవంబరు 2017 (16:27 IST)

ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రేణూ దేశాయ్ ఫీలైపోతోందట...

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. లేకపోతే దెబ్బైపోతుంది. ఇప్పుడు ఇలాగే ఫీలవుతోందట నటి రేణూ దేశాయ్. తను ఇటీవలి ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చెప్పిన సమాధానాలన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్, తన వి

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. లేకపోతే దెబ్బైపోతుంది. ఇప్పుడు ఇలాగే ఫీలవుతోందట నటి రేణూ దేశాయ్. తను ఇటీవలి ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చెప్పిన సమాధానాలన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్, తన విడాకులు, రెండో పెళ్లి గురించే వున్నట్లు అనిపిస్తోందట. అనవసరంగా మరోసారి తను వార్తల్లోకి ఎక్కానేమోనని నొచ్చుకుంటోందట. 
 
తను అలాంటి సమాధానాలను దాటవేసి వుండాల్సిందని ఫీలవుతుందట. ఈమధ్యనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రేణూ దేశాయ్ ఏబీఎన్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ వచ్చాక ఎక్కువగా రేణూ దేశాయ్ ఎందుకు విడాకులు తీసుకున్నదీ, రేణూ తను రెండో పెళ్లి చేసుకుంటానంటే చెక్ చేసి చేసుకో అని పవన్ అన్నారనీ... తదితర చర్చలు సామాజిక మాధ్యమాల్లో జరగడంపై ఒకింత ఫీలవుతున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నట్లు టాక్.