శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (14:48 IST)

రేణూ రెండో వివాహం చేసుకో.. కానీ బ్యాక్‌గ్రౌండ్ ముఖ్యం: పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారనేది తనకు తెలియకపోయినా.. పిల్లలకు తల్లిగా మాత్రం పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారనేది తనకు తెలియకపోయినా.. పిల్లలకు తల్లిగా మాత్రం పవన్ తనను చాలా గొప్పగా భావిస్తారని రేణు దేశాయ్ తెలిపారు.

ఇంకా తన రెండో వివాహం గురించి కూడా పవన్ కొన్ని సూచనలు చేశారన్నారు. తాను చేసుకోబోయే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలని చెప్పారని రేణూ దేశాయ్ తెలిపారు. 
 
ఇక పవన్‌కు-అన్నా దంపతులకు బాబు పుట్టినప్పుడు.. అంతకుముందు పాప పుట్టినప్పుడు కూడా తాను ఫోన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపానని రేణూదేశాయ్ అన్నారు. ఈలోకంలో శిశువుకు ఏం తెలుస్తుంది.. తాను ఎందుకు పుట్టానో.. అందుకే పవన్‌కు బాబు పుట్టిన వెంటనే కంగ్రాట్స్ చెప్పానని రేణు వివరణ ఇచ్చారు.

తల్లీ, కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించానని చెప్పారు. తమ పిల్లలు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై చర్చ తమ మధ్య ఎన్నడూ రాలేదని రేణు తెలిపారు.
 
పవన్ ఫ్యాన్స్ చెప్తున్నట్లు తాను ఎక్కువ మొత్తం తీసుకోలేదని.. అమెరికాలో తాను సోదరుడిగా భావించే వ్యక్తే తాను డబ్బు కోసం పవన్‌కు దూరమయ్యానని అపార్థం చేసుకున్నారని.. ఆ తర్వాత నిజం తెలిసి షాక్ అయ్యారని రేణు దేశాయ్ అన్నారు.