బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (14:35 IST)

సాయి పల్లవిని అలా వాడుకుంటున్నా ఏమీ చేయలేకపోతోందట...

సాయి పల్లవి పేరు చెప్పగానే ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సాయి పల్లవి తెలంగాణ యాసలో బ్రహ్మాండంగా నటించింది. ఈ చిత్రంతో ఆమెకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పడు దాన్నే సినీ నిర్మాతలు బాగా వాడేసుకోవాలనే నిర్ణయానికి వ

సాయి పల్లవి పేరు చెప్పగానే ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సాయి పల్లవి తెలంగాణ యాసలో బ్రహ్మాండంగా నటించింది. ఈ చిత్రంతో ఆమెకు తెలుగు సినీ ఇండస్ట్రీలో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పడు దాన్నే సినీ నిర్మాతలు బాగా వాడేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే... మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం కాలి. 
 
ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షుకుల ముందుకు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఎలాగూ సాయి పల్లవికి మంచి క్రేజ్ వుంది కాబట్టి చిత్రానికి హేయ్ పిల్లగాడ అనే టైటిల్ కూడా పెట్టేసి విడుదల చేయబోతున్నారు. సాయి పల్లవి పిచ్చిలో జనం సినిమా చూస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. 
 
ఈ విషయంలో సాయి పల్లవి ఏమీ చేయలేక చూస్తూ కూర్చోవాల్సి వస్తోందట. ఎందుకంటే చిత్రం తీసేటపుడు తన గత చిత్రాలు మరో భాషలోకి డబ్ అయితే డబ్బు చెల్లించాలన్న కండిషన్ పెట్టకపోవడమేనని చెప్పుకుంటున్నారు.