ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (17:46 IST)

కర్మ ఎవరినీ వదలదమ్మా.. విజయ్ దేవరకొండ కాలు సమంత భుజాన్ని తాకినా.? (video)

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండకు జంటగా నటించింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఖుషి సినిమాకు సంబంధించిన పాట రిలీజ్ అయ్యింది. ఇందులో కొత్తగా పెళ్లైన కపుల్ హ్యాపీ లైఫ్‌ గురించి చూపించారు. 
 
అయితే ఓ స్టిల్‌లో సమంత భుజంపై విజయ్ కాలు పెట్టినట్లు కనిపించింది. ఈ సీన్ ప్రస్తుతం ట్రోల్స్‌కు గురైంది. ఈ సీన్ విజయ్ సమంతల మధ్య ప్రేమతో కూడిన రిలేషన్‌ను ఇండికేట్ చేస్తున్నట్లుగా ఉంది. కానీ నెటిజన్లు మాత్రం 2014లో మహేష్ బాబు సినిమా విషయంలో సమంత చేసిన ట్వీట్‌ను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇదే కర్మ ఫలం అని కామెంట్ చేస్తున్నారు.
 
మొత్తానికి రెండు స్టిల్స్‌ను కంపేర్ చేస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇందులో మహేష్ వెనుక కృతి కుక్కలా పాకినట్లుగా ఉందంటున్నారు. 
 
అదే సమయంలో రీసెంట్ ఖుషి స్టిల్‌ మాత్రం భార్యాభర్తల మధ్య హ్యాపీ మూమెంట్స్ చూపిస్తోందని.. ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఇక సమంత హేటర్స్ మాత్రం నెగెటివ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.
Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
 
ఇక సమంత తాజాగా "సిటాడెల్" హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.