సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది : సమంత

samanta
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల పాటు కష్టపడటానికి సిద్ధపడాలి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అని ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుంత ఈమె ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించనున్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సమంత యేడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సామ్‌ ఇన్‌స్టా స్టోరీ చూస్తే అది నిజమే అనిపిస్తోంది.
 
'మరో మూడు రోజులు మాత్రమే ఈ కారవాన్‌లో ఉండేది' అని పెట్టింది. అలాగే తన ఫొటో షేర్‌ చేస్తూ.. 'ఆరు నెలలు కష్టంగా గడపడానికి సిద్ధపడాలి. ఎలాగైనా దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది' అని రాసింది. దీంతో 'ఖుషి' షూటింగ్‌ ముగిశాక సమంత మయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్‌ చూసి అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 
 
ప్రస్తుతం విజయ్‌దేవకొండ సరసన సమంత నటిస్తోన్న 'ఖుషి' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘నా రోజా నువ్వే...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా అది ట్రెండింగ్‌లో నిలిచింది.