శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (10:51 IST)

ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత

samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా వుండాలని డిసైడ్ అయ్యింది. 
 
సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఈ ఏడాది బ్రేక్ కాలంలో సమంత తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. అడిషనల్ ట్రీట్మెంట్ తీసుకోనుంది. 
 
ప్రస్తుతం ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తోంది. 
 
మరోవైపు 'సిటాడెల్' షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత ఆమె అన్ని కమిట్ మెంట్ల నుంచి ఫ్రీ అవుతుంది. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు.