సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జులై 2023 (10:55 IST)

సమంత షాకింగ్ నిర్ణయం... అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తుందా?

samanta
హీరోయిన్ సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆమె సినిమాలకు దూరంగా ఉండటం లేదా సుధీర్ఘ విరామం తీసుకోవడమా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా సినిమాలకు ఒకేసారి గుడ్‌బై చెప్పకుండా లాంగ్ గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమ మయోసైటి వ్యాధి బారి నుంచి కోలుకున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు ఒక యేడాది గ్యాప్ తీసుకుని తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, ఇందుకోసం అడ్మిరల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని భావిస్తుంది. ప్రస్తుంత ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ సాగుతోంది. అలాగే సిటాడెల్ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తున్నారు. ఇది కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత ఆమె ఫ్రీ అవుతారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్ కానీ కొత్తగా ఆమె ఏ ప్రాజెక్టులపై సంతకం చేయలేదు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది. సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు.