శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (19:35 IST)

బస్సు దిగుతుండగా కాలు జారింది.. చిన్నారి మృతి

school
కడపలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం స్కూల్‌ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి సఫినా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి సఫినా స్కూల్‌ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. 
 
అయితే స్కూల్‌‌కు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్‌ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. 
 
ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.