సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (09:30 IST)

కేరళ రాష్ట్ర డీజీపీగా పోరుమామిళ్ల వాసి

Shaik Darvesh Saheb
దేవుళ్లు, దేవతల నగరంగా భాసిల్లుతున్న కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండల కేంద్ర వాసి నియమితులయ్యారు. ఆయన పేరు ధర్వేష్ సాహెబ్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీగా నియమించింది. దీంతో ఆయన రెండు రోజుల క్రితం ఆయన రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 
 
పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధికి చెందిన ఆయన ప్రాథమిక విద్య పోరుమామిళ్లలో పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాల, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులవడంపై పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. 
 
డీబార్ చేశారన్న కోపంతో ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో విద్యార్థి దాడి..  
 
ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. బ్లేడుతో కాలేజీ ప్రిన్సిపాల్‌‍పై దాడి చేశాడు. పరీక్షల్లో కాపీ కొట్టినందుకు తనను డీబార్ చేశారన్న కోపంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు పట్టణంలోని చిన్నమసీదు ప్రాంతంలో ఉండే గొంట్ల గణేశ్‌ స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గత యేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్బంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచి అతడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిగిపోయాడు. 
 
స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో అతడు కొండారెడ్డి గొంత కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి, గొంతు వద్ద చిన్నపాటి గాయమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు కొండారెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.