గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (14:00 IST)

త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమాలో కేజీఎఫ్ విలన్?

chiru - sanjay
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కేజీఎఫ్ విలన్ కనిపించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కనిపించనుందని టాక్ వినిపించింది. తాజాగా మరో అప్డేట్ వైరలవుతుంది.
 
ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనతో చర్చలు జరపనున్నారట. 
 
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సంజయ్.. తనకు సౌత్‌లో నటించాలని ఉందని.. అవకాశం వస్తే చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇవ్వడంతో ఆయనకు ఆఫర్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.